భారత్, రష్యాల భారీ వార్ గేమ్.. - MicTv.in - Telugu News
mictv telugu

భారత్, రష్యాల భారీ వార్ గేమ్..

August 24, 2017

భారత్, రష్యాలు అక్టోబర్ లో భారీ సైనిక బలప్రదర్శనకు దిగనున్నాయి. ఆ నెల 19 నుంచి 29 వరకు మెగా వార్ గేమ్ నిర్వహించనున్నాయి. సైనిక బంధాల బలోపేతం కోసం ఈ విన్యాసాలు జరపనున్నాయి. ఇరు దేశాలు ఇంత భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు జరపడం ఇదే తొలిసారి. ఈ విన్యాసాల్లో ఇరు దేశాల నేవీ, ఆర్మీ, ఏయిర్ ఫొర్స్ విభాగాలకు చెందిన వందల మంది సైనికులు పాల్గొంటారు. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, యుద్ధ ట్యాంకులు, క్షిపణులతో ప్రదర్శనలు, కవాతులు నిర్వహిస్తారు.  ప్రపంచంలోని కీలక సైనిక స్థావరాల్లో ఒకటైన వ్లాడొవొస్టొక్ సహా సహా రష్యాలోని మరో మూడు ప్రాంత్లో వార్ గేమ్ జరుగుతుంది.

ఈ విన్యాసాలు భారత్ సైన్యానికి స్ఫూర్తినిస్తాయని భావిస్తున్నారు. ఒకపక్క.. డోక్లామ్ లో చైనా, భారత్ సైన్యాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో భారత్ తన మిత్రదేశమైన రష్యాతో ఈ భారీ విన్యాసాలకు శ్రీకారం చుట్టింది. “భారత్ తో బలమైన  మిలటరీ సైనిక సంబంధాల కోసం ఈ విన్యాసాలు చేస్తున్నాం’’ అని రష్యా పేర్కొనడం చైనాకు శరాఘాతమే. పాక్ కూడా భయాందోళనకరమే.