ఐరాసలో రష్యాకు చుక్కెదురు.. భారత్ డుమ్మా, చైనా ఒక్కటే.... - MicTv.in - Telugu News
mictv telugu

ఐరాసలో రష్యాకు చుక్కెదురు.. భారత్ డుమ్మా, చైనా ఒక్కటే….

March 24, 2022

fgnfgnb

సరిగ్గా గతనెల ఇదేరోజున రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌ దేశంపై యుద్ధం ప్రకటించాడు. ఆరోజు నుంచి నేటీవరకు ఉక్రెయిన్‌పై విపరీతంగా బాంబులు దాడి చేస్తూ, పలు ప్రధాన నగరాలను రష్య బలగాలు ఆక్రమించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలు చెల్లచెదురైపోయారు. కొన్ని కోట్ల సంపద నాశనం అయింది. దీంతో కొందరు దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశాలకు వెళ్లిపోయారు. మరికొంతమంది దేశ రక్షణ కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో గురువారం మానవతా సంక్షోభంపై రష్యా ప్రవేశ పెట్టిన తీర్మానం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీగిపోయింది.

అంతేకాకుండా ఈ తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కి భారతదేశంతోపాటు, అమెరికా సహా 13 దేశాలు దూరంగా ఉన్నాయి. రష్యా తీర్మానానికి కేవలం చైనా మాత్రమే మద్దతు తెలిపింది. అయితే, తీర్మానం ఆమోదానికి అవసరమైన 9 ఓట్లు రాకపోవడంతో తీర్మానం వీగిపోయినట్టు భద్రతా మండలి ప్రకటించింది. ఉక్రెయిన్‌లో తమ దాడులను ప్రస్తావించకుండానే అక్కడ మానవతా సంక్షోభంపై రష్యా తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి అనుకూలంగా ఓటు వేయాలని సభ్యదేశాలకు పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ ప్రజల సురక్షిత తరలింపునకు వీలుగా మానవతా సాయన్ని సులభతరం చేయాలని కోరింది.

ఈ సందర్భంగా అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ మాట్లాడుతూ…”ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు పాల్పడుతుందనే 13 సభ్య దేశాలు దూరంగా ఉన్నాయి. వారు సృష్టించిన మానవతా సంక్షోభాన్ని పరిష్కరించమని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతూ రష్యా తీర్మానం పెట్టడం అన్యాయం. మిలియన్ల మంది జీవితాలు ధ్వంసమైనా రష్యా పట్టించుకోవడం లేదు. రష్యా దురాక్రమణదారు. ఉక్రెయిన్‌లోని ప్రజలపై క్రూరత్వాన్ని ప్రదర్శించే పనిలో నిమగ్నమై ఉంది. నేరాన్ని అంగీకరించని తీర్మానాన్ని ఆమోదించాలని వారు కోరుకుంటున్నారు” ఆమె వ్యాఖ్యానించారు. భద్రతా మండలి లేదా సాధారణ అసెంబ్లీలో రష్యా ప్రవేశపెట్టే ఈ తీర్మానాలపై ఓటింగ్‌లో పాల్గొనబోమని ఐరాసలో యూకే ప్రతినిధి బార్బరా ఉడ్‌వర్డ్ అన్నారు.