ఆంక్షలపై రష్యా కొత్త ఆయుధం.. లీగల్ పైరసీ! - MicTv.in - Telugu News
mictv telugu

ఆంక్షలపై రష్యా కొత్త ఆయుధం.. లీగల్ పైరసీ!

March 12, 2022

bhfhd

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో తమ దేశంపై యూరప్, అమెరికాలు విధించిన ఆంక్షల ప్రభావాన్ని తగ్గించే దిశగా రష్యా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే.. పైరసీని చట్టబద్ధం చేయడం. ఆంక్షల పేరుతో ప్రముఖ టెక్నాలజీ సంస్థలు, పెద్ద సినిమా నిర్మాణ కంపెనీలు రష్యాలో కార్యకలాపాలను నిషేధించాయి. డిస్నీ, సోనీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ వంటి సంస్థలు తమ సినిమాలను రష్యాలో విడుదల చేయడం లేదు. ఈ నేపథ్యంలో వాటి ప్రభావం తమ పౌరుల మీద పడకుండా రష్యా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా పైరీసీని చట్టబద్ధం చేసేలా నిబంధనలను సడలించాలని ఆ దేశ ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. ఇది గనుక అమలైతే సినిమాలు, టీవీ షోలు, సాఫ్టవేర్లు, మొబైల్ గేమ్స్‌ల పైరసీ చట్టబద్ధమవుతుంది. ఒకవేళ ఈ చట్టం అమల్లోకి వస్తే మాత్రం అమెరికన్ టెక్నాలజీ, సినిమా కంపెనీలకు భారీ నష్టం చేకూరుస్తుంది.