ప్రాణాలున్నంత వరకు రష్యాతో పోరాడతాం : జెలెన్ స్కీ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రాణాలున్నంత వరకు రష్యాతో పోరాడతాం : జెలెన్ స్కీ

March 2, 2022

02

రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగాలంటే ముందుగా రష్యా చేస్తున్న బాంబు దాడులు ఆపాలని జెలెన్ స్కీ కరాఖండీగా చెప్పారు. బుధవారం అంతర్జాతీయ మీడియా సమావేశం నిర్వహించిన జెలెన్.. ప్రజలపై బాంబు దాడులు అపి చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రష్యా వైమానిక దళాన్ని నిలువరించేందుకు నాటో సభ్యులు తమ దేశాల్లో నో ఫ్లై జోన్ విధించాలని సూచించారు. ఇప్పుడు ఉక్రెయిన్ గనక ఓడిపోతే రష్యా దళాలు నాటో దేశాల సరిహద్దుకి దగ్గరలో మోహరిస్తాయని, అప్పుడు వారికి తమ లాంటి పరిస్థితే ఎదురవుతుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, యుద్ధం ఏడోరోజుకు చేరిన క్రమంలో ఇంకా ఎన్ని రోజులు రష్యాను ఎదుర్కొని నిలువగలరని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘మా ప్రాణాలున్నంత వరకు పోరాడతాం. రేపటి తరం కోసం మా దేశాన్ని కాపాడుకొంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించ’మని జెలెన్ స్కీ స్పష్టం చేశారు. కాగా, ఇరు దేశాల మధ్య జరిగిన తొలి విడత చర్చలు విఫలమైన విషయం తెలిసిందే.