భారత్‌కు రష్యా డిస్కౌంట్ ఆఫర్.. అమెరికా ఆక్రోశం - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌కు రష్యా డిస్కౌంట్ ఆఫర్.. అమెరికా ఆక్రోశం

April 1, 2022

ngvng

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న వేళ అంతర్జాతీయంగా చమురు ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ఇది భారతదేశం లాంటి కేవలం దిగుమతుల మీదే ఆధారపడుతున్న దేశాలకు భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో రష్యా భారత్‌కు ఓ ఆఫర్ ఇచ్చింది. మార్కెట్ రేటు కంటే 35 డాలర్ల తక్కువ రేటుకే ముడి చమురు సరఫరా చేస్తామని ముందుకొచ్చింది. రష్యా విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటనలో ఈ విషయాన్ని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై అమెరికా తీవ్రంగా స్పందించింది. యుద్ధానికి ముందులాగే దిగుమతులు చేసుకోవాలని, అంతకు మించి దిగుమతులు చేస్తే భారత్‌పై కూడా ఆంక్షలు వేసేందుకు వెనకాడబోమని పరోక్షంగా హెచ్చరిస్తోంది. అలా చేస్తే భారత్‌‌కు చాలా పెద్ద రిస్క్ అవుతుందని స్పష్టం చేసింది. రూబుల్ – రూపాయి చెల్లింపులతో కూడా తమకు ఎలాంటి సమస్య లేదనీ, అయితే గతం కంటే ఎక్కువ చమురు దిగుమతి చేసుకోరాదని అమెరికా ప్రతినిధి హెచ్చరించారు. మరోవైపు అమెరికా ప్రతినిధి మాట్లాడుతూ.. భవిష్యత్తులో చైనా భారత్ పై దాడి చేస్తే రష్యా ఇండియాకు అండగా వస్తుందనుకుంటున్నారా? అంటూ ప్రశ్న లేవనెత్తారు. కాగా, పై రెండు అంశాలపై భారత వైఖరి ఏమిటనేది ఇప్పటివరకు వెల్లడికాలేదు.