2036 వరకు రష్యాకు పుతినే ప్రధాని.. ఒక్క చట్టసవరణతో.. - MicTv.in - Telugu News
mictv telugu

2036 వరకు రష్యాకు పుతినే ప్రధాని.. ఒక్క చట్టసవరణతో..

July 2, 2020

Russia President Putin Keep Power From 2036

రష్యా చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఆ దేశ అధ్యక్షుడిగా నిరంతరాయంగా కొనసాగేందుకు పుతిన్ సరికొత్త చట్టం తయారు చేసుకున్నారు. మరో 16 ఏళ్ల పాటు తానే అధ్యక్షుడిగా ఏక చత్రాదిపత్యంగా ఉండే విధంగా రాజ్యాంగ సవరణ చేసి కొత్త చట్టం అమలులోకి తెచ్చారు. దీనికి ప్రజాభిప్రాయం కూడా తీసుకోవడంతో ఇక 2036 వరకు ఆయనే రష్యా అధ్యక్షుడిగా ఉండబోతున్నారు. ఎలాంటి ఎన్నికలు లేకుండానే ఆయనే ఈ పదవిని నిర్వర్తించనున్నారు. దీంతో ఆ చర్య యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. 

ఇటీవల రష్యా పార్లమెంట్ ఈ సవరణలకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ప్రజల అభిప్రాయం కోసం ఏకంగా వారం రోజులపాటు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలు బుధవారం ముగియడంతో ఫలితాలను అక్కడి ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంట్లో ప్రజలు 76.9 శాతం మంది పుతిన్ నిర్ణయాన్ని స్వాగతించారు. వారంతా చట్టసవరణకు అనుకూలంగా ఓటు వేశారు. మెజార్టీ ప్రజలు దీనికి ఆమోదం తెలపడంతో ఇక ఆయన పాలనకు మార్గం సుగమమైంది. ఈ ఎన్నికల్లో దేశంలో  దాదాపు 60 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా ఈసీ ప్రకటించింది. 

ప్రస్తుతం 79 ఏళ్ల వయసు ఉన్న పుతిన్ 95 ఏళ్లు వచ్చే వరకు రష్యా అధ్యక్షుడిగా ఉండనున్నారు. అంటే 2036 వరకు ఆయన పాలనకు తిరుగు ఉండదని అంటున్నారు. అతడికి ఉన్న ప్రజా ఆమోదం, చేసిన పనులే ఈ సవరణకు అనుకూలంగా ప్రజలు స్పందించేలా చేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2000 సంవత్సరం నుంచి పుతిన్ ప్రధానిగా, అధ్యక్షుడిగా పదవులు చేపట్టారు. ఇటీవలే మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన 2024లో మరోసారి ఎన్నికలు వెళ్లాల్సి ఉంది. కానీ అవేవి లేకుండా ఉండేందుకు రాజ్యంగా సవరణ చేయడం విశేషం. కాగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ గత ఏప్రిల్ నెలలో జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదాపడి ఇటీవల నిర్వహించాల్సి వచ్చింది.