ఫలించిన చర్చలు.. రష్యా బలగాలు వెనక్కి - MicTv.in - Telugu News
mictv telugu

ఫలించిన చర్చలు.. రష్యా బలగాలు వెనక్కి

March 29, 2022

ftyjxdth

నెలరోజులకు పైగా జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదు విడతలుగా సాగిన చర్చలు విఫలమవగా, ఆరో విడత చర్చలు కొంత మేర పలించాయి. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్, చెర్నీవ్‌ల నుంచి తన బలగాలను వెనక్కి తీసుకోవడానికి రష్యా అంగీకరించింది. మిగతా ప్రతిపాదనలపై సమీక్షించుకొని ముందుకు సాగుతామని ప్రకటించింది. మూడు గంటల పాటు జరిగిన చర్చలు అర్థవంతంగా సాగినట్టు రష్యా ప్రతినిధి వెల్లడించారు. ఈ చర్య మున్ముందు జరిగే చర్చలకు దోహదపడుతుందని, రష్యా తన అంతియ లక్ష్యం సాధించడానికి ఉపయోగపడుతుందని వివరించారు.