పుతిన్‌తో పాటు మరి వెయ్యి మందిపై కెనడా నిషేధం - MicTv.in - Telugu News
mictv telugu

పుతిన్‌తో పాటు మరి వెయ్యి మందిపై కెనడా నిషేధం

May 18, 2022


ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆర్థిక, వ్యాపార, వాణిజ్య, దైపాక్షిక సంబంధాలు.. ఇలా అన్ని రకాలుగా రష్యా ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఆ దేశంపై ఆర్థిక పరమైన అంశాలపై నియంత్రణలు విధించిన కెనడా.. తాజాగా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ పై నిషేధం విధించింది. పుతిన్‌ తమ దేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును సెనెట్ లో ప్రవేశపెట్టింది.

యుద్ధం వల్ల ఎదురువుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెనడా స్పష్టం చేసింది. రష్యా ఉక్రెయిన్‌ గడ్డపై పాల్పడుతున్న యుద్ధనేరాలకు బదులు తీర్చుకునేందుకు పుతిన్‌, ఆయన అనుచర గణం ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఈ నిషేధం బిల్లు ఆమోదం పొందితే పుతిన్ తో పాటు.. ఆ దేశ ప్రభుత్వంలోని అధికారులు, మిలటరీ పెద్దలు స‌హా సుమారు వెయ్యి మందికి పైగా కెనడాలోకి ప్రవేశించే అవ‌కాశం ఉండ‌దు.