‘2022లోనూ ఇటువంటివి జరుగుతున్నాయంటే నమ్మలేకపోతున్నా. ప్రపంచంలోని నియంతలు యుద్ధాలు మొదలుపెట్టడానికి, దురాక్రమణలు చేయడానికి ప్రపంచంలోని అసమర్థ నాయకులే కారణం. నియంతల్లో ఇంత ధైర్యం నిండడానికి వారే కారణం. ఆ యుద్ధంలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతోన్న అమాయక ప్రజలు క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని టాలీవుడ్ హీరో నిఖిల్ పేర్కొన్నాడు.
మరోపక్క అంతర్జాతీయ అంశాలపై స్పందించడంలో టాలీవుడ్ హీరో నిఖిల్ ముందుంటాడు. గతంలో ఉత్తర కొరియా చర్యలు, పలుదేశాల మధ్య యుద్ధ పరిస్థితులపై అందరం చచ్చిపోతామేమో భయ్యా అంటూ ఆయన ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు రష్యా -ఉక్రెయిన్ యుద్ధంపై హీరో నిఖిల్ ట్విటర్ వేదికగా తన స్పందనను తెలిపాడు.