ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. రాజధాని కీవ్లోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లోని నగరాల్లో క్షిపణుల వర్షం కురిపించింది. ఒకే ఒక్క రోజులో దాదాపు 81 క్షిపణులను ప్రయోగించి అల్లకల్లోలాన్ని సృష్టించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రక్షణశాఖ అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. జనవరి తరువాత జరిగిన అతిపెద్ద దాడిగా దీనిని అభివర్ణిస్తున్నారు. ఈ దాడిలో పెద్ద మొత్తంలో ప్రాణనష్టం జరగలేదని వాహనాలు ధ్వంసం అయ్యాయని అధికారులు తెలిపారు. రష్యా 81 క్షిపణులను ప్రయోగిస్తే అందులో 34 క్షిపణులను కూల్చివేసినట్లు ప్రకటించారు. ఈ క్షిపణుల దాడిలో జపోరిజియా అణు విద్యుత్ కేంద్రానికి ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థకు మధ్య ఉన్న చివరి కనెక్షన్ తెగిపోయింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రష్యాల్వీవ్పైలో చేసిన దాడిలో ఐదుగురు మరణించగా, డెనిప్రోపెట్రోవస్క్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ప్రతి పది ఇళ్లల్లో నాలుగు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇళ్లపైన క్షిపణులు కూలీనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలు షెల్టర్లలోనే ఉండాలని మేయర్ సూచించారు.
కొన్నేళ్లుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ విరామాలతో కూడిన యుద్ధాన్ని ఉక్రెయిన్పై కొనసాగిస్తున్నాడని అమెరికాకు చెందిన నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రియల్ హైసన్ తెలిపాడు. వ్యూహ్యాత్మకంగా దాడి చేసే సామర్థ్యం రష్యాలో తగ్గిపోయిందని వెల్లడించారు. రష్యా తిరిగి పుంజుకోవడానికి అమెరికా సహకరించదన్నారు. యుద్దం మొదలై సంవత్సరం దాటినా ఉక్రెయిన్ లొంగకపోవడంతో మరో కొత్త వ్యూహాన్ని రష్యా రచిస్తోంది.