రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పట్లో తెరపడే అవకాశం కనిపించడం లేదు. రెండు దేశాలూ పట్టినపట్టు విడవకపోవడంతో విలువైన ప్రాణాలు బలవుతున్నాయి. రణరంగంగా మారిన డాంబాస్ ప్రాంతంలో రష్యా జరుపుతున్న దాడుల్లో రోజూ వందమందికిపైగా ఉక్రెయిన్ సైనికులు బలవుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా ఈ లెక్కను అంగీకరించాడు. రష్యా బలగాలు చొచ్చుకురాకుండా ఉక్రెయిన్ సైన్యం భారీగా కందకాలు తవ్వుతోంది. అయితే రష్యన్లు తుపాకులతో విరుచుకుపడుతుండడంతో దానిదే పైచేయింగా మారింది.
‘రోజూ 60 నుంచి 100 మందిని కోల్పోతున్నాం. 500 మంది గాయపడుతున్నారు. మాకు ప్రపంచ దేశాలు సాయం చేయాలి. మరిన్ని తుపాకులు, శతఘ్నులు ఇవ్వాలి. యుద్ధంలో మా శయక్తులా పోరాడతాం’ అని జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్ నుంచి విడిపోయి రష్యాలో కలవడానికి సిద్ధమైన ప్రాంతాలను నిలుపుకోడానికి ఇటు ఉక్రెయిన్ అటు రష్యా దాడులు జరుపుతున్నాయి. ప్రస్తుతం సెవెర్దోనెస్క్ ప్రాంతంపై పట్టుకోసం రష్యా భీకర యుద్ధం చేస్తోంది.