అంతరిక్షంలో సినిమా షూటింగ్.. రష్యా కేక  - MicTv.in - Telugu News
mictv telugu

అంతరిక్షంలో సినిమా షూటింగ్.. రష్యా కేక 

September 23, 2020

Russia Wants to Be the First to Shoot a Movie In Space

సినిమాల్లో కనిపించే అంతరిక్షం నిజమే అన్నట్టు గ్రాఫిక్‌లో డిజైన్ చేసి అబ్బుర పరుస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు అభూత కల్పనలను వీడి రియాలిటీ వైపు పరుగులు పెడుతున్నాయి. అంతరిక్షాన్ని సీజీ చేసి చూపించడం ఎందుకు నిజంగానే చూపిస్తే పోలా అని ఓ రష్యా దర్శకుడు భావించాడు. అతను ఎవరో కాదు.. అంతర్జాతీయ రేసులో ఉన్న టామ్ క్రూజ్ అనే దర్శకుడు. టామ్ క్రూజ్ ఇంతవరకు ఎవరూ చేయని సాహసాన్ని చేస్తున్నారు. అంతరిక్షంలో రియల్ లొకేషన్‌లో తొలిసారి సినిమా షూటింగ్ చేయడానికి సిద్ధం అవుతున్నారని రష్యన్ స్పేస్ ఏజెన్సీ రొసోమాస్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో షూటింగ్ చేసేందుకు ముందుకొచ్చిన ప్రపంచంలోనే తొలి దేశంగా రష్యా నిలిచింది. 

రష్యాలోనే అతిపెద్ద స్టూడియో అయిన ‘యెల్లో, బ్లాక్ అండ్ వైట్ స్టూడియో’ ఈ సరికొత్త పనికి పూనుకున్నట్టు తెలుస్తోంది. 2021లో శీతాకాలంలో ఓ ఫ్లైట్‌తో దీనికి పూనుకునే విధంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రెడీ చేయనుంది. ఓపెన్ కాంటెస్ట్‌లో భాగంగా.. ప్రొటోజనిస్ట్ ఐఎస్ఎస్‌కు ఎగిరిపోనున్నారు. ఇక సినిమా పేరు, నటీనటులు, షూటింగ్ చేయబోయే ప్రదేశాల గురించి చిత్ర యూనిట్ చర్చిస్తోంది. మరోవైపు సాంకేతికంగా స్పేస్‌లో సినిమాను ఎలా చిత్రీకరించాలో కూడా ముందస్తు ప్రణాళికలు చేసుకుంటున్నారు. రష్యా స్పేస్ యాక్టివిటీస్‌ను మరింత పాపులర్ చేసే దిశలోనే ఈ సినిమా తీయాలని భావించారట. కాగా, ఈ విషయమై నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టిన్ మే నెలలో ట్వీట్ చేసింది. ‘హాలీవుడ్ ఏ-లిస్టర్ టామ్ క్రూయిజ్.. SpaceXతో కలిసి స్పేస్‌లో యాక్షన్ సినిమా తీయనున్నారు’ అని ట్వీట్ చేయగా.. ‘NASA టామ్ క్రూయీజ్‌తో కలిసి సినిమా కోసం పనిచేయడానికి ఉత్సాహంగా ఉంది’ అంటూ SpaceX సీఈఓ ఎలోన్ మస్క్ కామెంట్ చేశారు.