ఉక్రెయిన్‌లో ఘోరం జరిగింది. ఒకరు కాదు. ఇద్దరు కాదు. ఏకంగా 300 మంది స్పాట్లోనే మృతి ఘటన వెలుగుచూసింది. రష్యా బలగాలు గత నెల నుంచి నేటీవరకు ఉక్రెయిన్ దేశంపై భీకరమైన దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీవ్, టర్కివ్, మరియు పోల్ వంటి నగరాల్లో క్లిపణులతో, బాంబు దాడులతో ఉక్రెయిన్ను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ క్రమంలో మరియు పోల్‌లో ఓ థియేటర్‌పై జరిపిన బాంబు దాడిలో 300 మంది మృతి చెందినట్టు అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం.. మరియు పోల్‌లో వందల మంది ఆశ్రయం పొందుతున్న థియేటర్‌పై గత వారంలో రష్యా జరిపిన దాడుల్లో 300 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్టు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. దీంతో లక్షలాది ప్రజలు తాగునీరు, ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. రష్యా బలగాల షెల్లింగ్ దాడులతో బిక్కుబిక్కుమంటున్నారు. చిన్నారులు, మహిళల పరిస్థితి మరీ దయనీయంగా మారింది.
మరోపక్క 18వేల మందికి పైగా రష్యా సైనికుల హతమయ్యారు అనే విషయం పక్కనపెడితే.. రష్యా సేనల్ని ఉక్రెయిన్ బలగాలు దీటుగా ప్రతిఘటిస్తున్నాయి. ఇప్పటివరకు 16,100 మందికి
పైగా రష్యా సైనికుల్ని మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో పాటు 561 యుద్ధ ట్యాంకులు, 1825 సాయుధ శకటాలు, 115 యుద్ధ విమానాలు, 125 హెలికాప్టర్లతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు ప్రకటించుకుంది.