జేఈఈ మెయిన్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో రష్యన్ సిటిజన్ అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

జేఈఈ మెయిన్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో రష్యన్ సిటిజన్ అరెస్ట్

October 4, 2022
Russian citizen arrested in JEE Main question paper leak case
 

 

గతేడాది జేఈఈ మెయిన్ పరీక్ష పత్రం లీక్ అవడం కలకలం రేపింది. ఈ కేసు అప్పుడు తీవ్ర సంచలనం సృష్టించగా, సీబీఐ దర్యాప్తు చేపట్టింది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన రష్యా జాతీయుడు మిఖాయిల్ షార్గిన్‌ను సీబీఐ అధికారులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. కజకిస్తాన్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన నిందితుడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలువరించి సీబీఐ అధికారులకు అప్పగించారు. వారు అతడిని సాఫ్ట్ వేర్ ట్యాంపరింగ్ అంశంపై ప్రశ్నిస్తున్నారు. కాగా, జేఈఈ పరీక్షల కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఐలియన్ పేరిట ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించింది. దీనిని ట్యాంపరింగ్ చేశాడని మిఖాయిల్ షార్గిన్‌పై ఉన్న ప్రధాన అభియోగం. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మిఖాయిల్ దేశం విడిచి వెళ్లిపోయాడు. దాంతో సీబీఐ అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది.