ప్రపంచంలోనే తొలిసారి కరోనా వైరస్ చికిత్స కోసం రష్యా తయారు చేసిన టీకా హైదరాబాద్ చేరుకుంది. ప్రయోగ పరీక్షల కోసం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ దీన్ని తీసుకొచ్చింది. రెడ్డీస్ ల్యాబ్‌లో రెండు, మూడో విడత క్లినికల్ ట్రయల్స్ కోసం చేసుకున్న ఒప్పందం కింద స్పుత్నిక్ టీకాలను తీసుకొచ్చారు.
కరోనా సోకిన రెండు వేల మందిపై క్లినికల్ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఈ నెల 15 నుంచి ట్రయల్స్ ప్రారంభవుతాయి. నివేదికలను డీజీసీఐకి అందజేస్తారు. డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ కి 100 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను సరఫరా చేయనుంది. స్పుత్నిక్ టీకాలపై వాస్తవానికి భారత్‌లో 3వ దశ ట్రయల్ మాత్రమే నిర్వహించాలని అనుకున్నారు. అయితే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, నిపుణుల కమిటీ ఆమోదంతో 2వ దశ ట్రయల్స్‌ను కూడా చేపడుతున్నారు. 1500 మందితో అడాప్టివ్ ఫేజ్ 2,3 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు టీకాను మార్కెటింగ్ చేస్తున్న ఆర్డీఐఎఫ్ సంస్థ తెలిపింది. స్పుత్నిక్ టీకా ఇదివరకు నిర్వహించిన ప్రయోగాల్లో 92 శాతం సక్సెస్ రేటు సాధించింది.