ఆక్స్‌ఫర్డ్ టీకా వేసుకుంటే కోతులుగా మారిపోతారా?  - MicTv.in - Telugu News
mictv telugu

ఆక్స్‌ఫర్డ్ టీకా వేసుకుంటే కోతులుగా మారిపోతారా? 

October 16, 2020

Russian disinformation effort: Oxford’s COVID-19 vaccine turns people into monkeys

కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ తదితరాలపై ఎన్ని ఊహాగానాలు, వదంతులు ప్రచారంలో ఉన్నాయో మనకు తెలిసిందే. ఆ రోగంపై వచ్చినన్ని పుకార్లు మరే అంశంపైనా రాలేదని లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాకు మందుగా  బ్రిటన్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా కంపెనీ ఆక్స్‌ఫర్డ్ వర్సిటీతో కలిసి  తీసుకొచ్చిన టీకాపై దుమారం రేగుతోంది .

ఆ టీకాను వేసుకునే పేషంట్ల ఒళ్లంతా బొచ్చు వచ్చేసి అచ్చం కోతులుగా మారిపోతారని ప్రచారం జరుగుతోంది. ఆస్ట్రాజెనెకా టీకాలో చింపాంజీల నుంచి సేకరించిన వైరస్ వాడారని, అందువల్ల దాన్ని తీసుకున్నోళ్లకు కూడా కోతులు స్వభావం వచ్చేసి, వాటిగా మారిపోతారని అంటున్నారు. కేవలం ప్రచారమే కాకుండా కోతులుగా మారిపోయారంటూ కొన్ని ఏప్ ఫొటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. బ్రిటన్ ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసుకుని రష్యా నుంచి ఇలాంటి కథనాలు వెలువడుతున్నాయి. బ్రిటన్‌తో పోటీ పడిన రష్యా.. ప్రపంచంలోనే తొలిసారిగా కరోనా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తను తయారు చేసిన ‘స్పుత్నిక్ 5’ టీకాను అమ్ముకోడానికి ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు రష్యా ఇలాంటి ప్రచారం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. కోతులుగా మారతారనే వార్తలపై ఆస్ట్రాజెనెకా చీఫ్ స్పందించారు. అలాంటి వార్తలను ఎవరూ నమ్మొద్దని కోరారు.