russian film shot international space station
mictv telugu

అంతరిక్షానికి చేరుకున్న సినిమా

January 3, 2023

russian film shot international space station

మనుషులు క్రేజీగా తయారయ్యారు. స్పేస్ సెంటర్, అంతరిక్షంలోకి వెళ్ళడం లాంటివే అద్భుతం అనుకుంటే ఇప్పుడు అక్కడ ఏకంగా సినిమా షూటింగే చేసేస్తున్నారు. హాలీవుడ్ మొదట ఈ ఘనత సాధిస్తుందని అనుకున్నారు అందరూ. టామ్ క్రూయిజ్ తన నెక్స్ట్ సినిమా నాసా సహకారంతో స్పేస్ లో షూట్ చేస్తారని బోలెడు వార్తలు వచ్చాయి. కానీ దానికన్నా ముందే రష్యా వాళ్ళు ఈ ఘనత సాధించేసారు.

రష్యా దర్శకుడు క్లిమ్ షిపెంకో చేస్తున్న త ఛాలెంజ్ సినిమాలో ఒక సన్నివేశాన్ని స్పేస్ లో షూట్ చేశారు. దీన్ని అ్తర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో తీశారు. ఇందులో యాక్ట్ చేసిన యూలియా పెరెస్లిడ్ 12 రోజుల పాటూ ఐెస్ఎస్ లో గడిపారు. ఈ షూటింగ్ ఎప్పుడో 2021లోనే జరిగింది. అయితే దీని ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. దాంతో ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ట్రైలర్ కూడా దుమ్ము లేపేలా ఉందని అంటున్నారు. షూట్ కోసం సినిమా యూనిట్ ఐఎస్ఎస్ లో లాండ్ అయిన తీరును కూడా సినిమాలో పార్ట్ గా చూపించనున్నారుట. ముందుముందు మూన్, అంగారకుడు మీద సినిమాలు చేస్తానని క్లిమ్ చెబుతున్నారు.