తక్కువ అంచనా వేయొద్దు.. మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది - MicTv.in - Telugu News
mictv telugu

తక్కువ అంచనా వేయొద్దు.. మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది

April 26, 2022

రష్యా దాడులు భూగోళాన్ని మూడో ప్రపంచ యుద్ధం ముంగింటికి తీసుకెళ్లాయని ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశమే ఒప్పుకుంటూ శత్రు దేశాలకు ఘాటు హెచ్చరిక జారీ చేసింది. ఉక్రెయిన్ పై తన దాడుల నేపథ్యంలో భద్రత మెరుగుపరచుకోడానికి  అమెరికా, దాని మిత్ర దేశాలు ఉక్రెయిన్‌కు డబ్బు, ఆయుధాలు, సాంకేతిక సహాయం అందిస్తుడంపై మాజీ సోవియట్ రాజ్యం ఘాటుగా స్పందించింది.

‘అమెరికా చర్యలతో మూడో ప్రపంచ యుద్దం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది నిజం. మా హెచ్చరికలను తక్కువ అంచనా వేయవద్దు’ అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోె పక్క.. తమ దేశంలోని జర్మనీకి చెందిన దౌత్యాధికారులు 40 మందిని బహిష్కరిస్తున్నట్టు రష్యా ప్రభుత్వం  ప్రకటించింది. ఈ మేరకు జర్మన్ రాయబారికి నోటీసులు జారీ చేశామని తెలిపింది. ఏప్రిల్ 4న జర్మనీ రష్యాకు చెందిన 40 మంది దౌత్యాధికారులను బహిష్కరించగా, అందుకు ప్రతిచర్యగానే రష్యా తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇదిలా వుండగా మరిన్ని ఆయుధాలు అందించే విషయంపై అమెరికా తన మిత్రదేశాలతో మంగళవారం భేటీ జరుపనుంది.