కండల కోసం అడ్డదారి.. ప్రాణాలపైకి.. - MicTv.in - Telugu News
mictv telugu

కండల కోసం అడ్డదారి.. ప్రాణాలపైకి..

November 18, 2019

Russian

సినిమాల్లో అలీ, అల్లరి నరేష్‌ వంటి నటులు ప్రేక్షకులను నవ్వించడానికి నకిలీ కండలు పెట్టుకుంటారన్న సంగతి తెల్సిందే. రష్యాకు చెందిన 23ఏళ్ళ బాడీ బిల్డర్ కిరిల్ తెరేషిన్ నిజజీవితంలో అడ్డదారిలో కండలు తెచ్చుకొని ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. 

Russian

చేతి కండరాలు పెద్దవిగా కనిపించడానికి వాటిలోకి లీటర్ల కొద్దీ పెట్రోలియం జెల్లీ ద్రవాన్ని ఎక్కించుకున్నాడు. నకిలీ ‘కండ’ను  వెంటనే తొలగించకపొతే చేతులు పడిపోయి, ప్రాణాలే పోయే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అలానా మావేవ అనే ప్లాస్టిక్ సర్జరీ బాధితుల సంఘం కార్యకర్త కిరిల్‌ను ఆపరేషన్ కోసం ఒప్పించి.. అందుకు కావాల్సిన విరాళాలను సైతం సేకరించింది. సర్జన్ డిమిట్రీ మెల్నికోవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కిరిల్ చేతికి కండరాలు పెద్దవిగా కనపడడానికి మూడు లీటర్ల పెట్రోలియం జెల్లీని ఎక్కించుకున్నాడు. అది శరీరానికి ఎంతో ప్రమాదకరం. పెట్రోలియం జెల్లీ చేతికి రక్త ప్రసరణ జరుగకుండా అడ్డుకుంటుంది. తద్వారా చేయి పూర్తిగా పనిచేయకుండా పోతుంది. సర్జరీకి ముందే కిరిల్ కు అతి జ్వరం, నొప్పి, బలహీనత ఏర్పడ్డాయని డిమిట్రీ తెలిపాడు. ప్రస్తుతం రెండు గంటల పాటు శ్రమించి కిరిల్ చేతిలో ఉన్న  పెట్రోలియం జెల్లీని తొలగించామని వెల్లడించారు. కిరిల్ చేతికి ఇంకొన్ని ఆపరేషన్‌లు అవసరమని తెలిపారు.

Russian