నగ్నంగా కరోనా పేషంట్లకు నర్సు సేవలు.. ఆమె వాదన ఇదీ - Telugu News - Mic tv
mictv telugu

నగ్నంగా కరోనా పేషంట్లకు నర్సు సేవలు.. ఆమె వాదన ఇదీ

May 21, 2020

cfnbcfn

కరోనా వైరస్ పోరాటంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. నేరుగా రోగుల వద్దకు పీపీఈ కిట్లు ధరించి వెళ్తున్నారు. కానీ ఓ నర్సు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. ఒంటిపై దుస్తులు వేసుకోకుండా ఆమె నగ్నంగా కనిపిస్తూ.. రోగులకు సేవలు అందిస్తోంది. పై నుంచి పీపీఈ కిట్ వేసుకొని దాని లోపల కేవలం రెండు కట్ పీసులు మాత్రమే ధరించింది. అంతే కాకుండా ఎలాంటి భయం లేకుండా ఆమె పురుషుల వార్డులో కరోనా రోగులకు చికిత్స అందిస్తోంది. శరీరం పూర్తిగా బయటకు స్పష్టంగా కనిపించేలా ఇది ఉండటంతో ఈ విషయం పెను దుమారం రేపింది. రష్యా తలా ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ విషయం తెలియడంతో  ఆరోగ్యశాఖ కార్యాలయం సీరియస్‌గా స్పందించింది. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆ నర్సు తాను అలా చేయడానికి కారణం వెల్లడించింది. పీపీఈ సూట్ ధరిస్తే చాలా వేడిగా ఉంటుందని ఆ వేడిని తట్టుకోలేక టూ పీస్ బికిని ధరించానని చెప్పింది. అయితే పీపీఈ కిట్ పల్చగా ఉండటంతో లోపలి భాగంగా కనిపిస్తోందని పేర్కొంది. తాను చేసిన దాంట్లో తప్పేమి లేదని, సౌకర్యం కోసమే అలా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఆమె వాదనలతో అధికారులు ఏకీభవించలేదు. ఇది రోగుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని భావించారు. దీంతో ఆమెపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. కొంత మంది నెటిజన్లు మాత్రం ఆమెకు అండగా నిలిచారు. పీపీఈ కిట్ ధరించడం వల్ల వారి సమస్యలు ఎలా ఉన్నాయో ఈ విధంగా చెప్పుకొచ్చారంటూ పేర్కొంటున్నారు.