Russian on Ukrainian shopping mall
mictv telugu

1000 మంది ఉన్న షాపింగ్ మాల్‌పై బాంబు దాడి..

June 28, 2022

 Russian on Ukrainian shopping mall

ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న రష్యా ఎంతకూ తను అనుకున్నది సాధించలేకపోవడంతో దాడులను తీవ్రం చేసింది. సైనిక స్థావరాలను, ప్రభుత్వ భవనాలను, కొన్ని చోట్ల జనవాసాలను కూడా లక్ష్యం చేసుకుని దాడి చేస్తూ వస్తున్న రష్యా వైమానిక బలగాలు తాజాగా కిక్కిరిసిన ఓ షాపింగ్ మాల్ పై బాంబు దాడులకు తెగబడ్డాయి.

పాల్తోవా ప్రాంతంలోని క్రమన్ చెక్ నగరంలో రద్దీగా ఉన్న షాపింగ్ మాలపై రష్యా వాయుసేన క్షిపణి దాడులు చేసింది. భారీగా మంటలు చెలరేగి చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్ముకంది. 20 మంది మృతదేహాలను బయటికి తీశారు. శిథిలాల్లో మరిన్ని మృతదేహాలు ఉన్నాయని, దాడుల సమయంలో మాల్‌లో వెయ్యిమంది ప్రజలు ఉన్నారని అధికారులు తెలిపారు. 40 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, పదిమంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. కాగా, ఈ ఏడాది చివరికైనా రష్యా దాడులకు ముగింపు పలకేలా చూడాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నారు. జీ7 దేశాల కూటమి ఈ బాంబుదాడిని తీవ్రంగా ఖండించింది.