Russian President Vladimir Putin has survived life attempt
mictv telugu

పుతిన్‌పై హత్యాయత్నం.. పలువురి అరెస్ట్!

September 15, 2022

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. అతడు ప్రయాణిస్తున్న కారు ముందు చక్రం మొరాయించి దట్టమైన పొగ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. యూరో వీక్లీ న్యూస్ కథనం ప్రకారం.. ‘పుతిన్ ఎస్కార్ట్ వాహానాల్లో మొదటి రెండు వాహనాలకు ఇబ్బంది కలిగింది. ఒ వాహనం అదుపు తప్పి గింగిరాలు తిరిగింది. ఆయన ప్రయాణస్తున్న కారుపై పెద్ద శబ్దంతో దెబ్బ తగిలింది. అయితే ఏ ప్రమాదమూ జరగకుండా వెళ్లిపోయింది.’ ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలియడం లేదు. దీనికి సంబంధించి పలువురిని అరెస్ట్ చేసినట్లు ఆ పత్రిక పేర్కొంది.

తాను ఐదు హత్యాయత్నాలనుంచి తప్పించుకున్నానని పుతిన్ చెబుతుంటారు. మూడు నెలల కిందట అతనిపై హత్యాయత్నం జరిగిందని, సురక్షితంగా తప్పించుకున్నాడని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. ఈ వార్తలపై రష్యా ప్రభుత్వం అధికార ప్రకటనేదీ చేయలేదు. పుతిన్ కు కేన్సర్ సోకిందిని, రేపోమాపో చనిపోతాడని వస్తున్న వార్తల మధ్య యాక్సిడెంట్ మరింత కలకలం రేపుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా ఆరేడు నెలలుగా యుద్ధం చేస్తుండడం తెలిసిందే. రెండు దేశాలూ భారీగా నష్టపోతున్నాయి.