రష్యాలో దారుణం చోటుచేసుకుంది. కరోనా టీకా స్పుత్నిక్-వీ(Sputnik V) తయారు చేసిన శాస్త్రవేత్తలలో ఒక్కరైన ఆండ్రూ బొటికోవ్(Andrey Botikov) అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. తన అపార్ట్ మెంట్‌లో ఆండ్రూ బొటికోవ్ శవమైన కనిపించడం కలకలం రేపింది. బెల్ట్‌తో బొటికోవ్ గొంతును నులిమి చంపివేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు మొదట బొటికోవ్‌తో వాగ్వాదానికి దిగి తర్వాత హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడికి గతంలో కూడా క్రిమినల్ రికార్డు ఉన్నట్లు గుర్తించారు.
47 ఏళ్ల బొటికోవ్ గామాల్యే నేషనల్ రీసర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మ్యాథమెటిక్స్ లో సీనియర్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ టీకాను అభివృద్ధి చేసిన 18 మంది శాస్త్రవేత్తల్లో బొటికోవ్ ఒకరిగా ఉన్నారు. బొటికోవ్‌కు 2021లో రష్యా ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును ఆయన దేశాధ్యక్షుడు పుతిన్ చేతుల మీదుగా అందుకున్నారు.