Russian soldiers stole animals from a zoo in Kherson region
mictv telugu

పోరాడే సత్తా లేక చోరీలు చేస్తున్న రష్యన్ సైనికులు.. వీడియో

November 15, 2022

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా.. కీలకమైన ఖేర్సాన్ నగరాన్ని జయించి తర్వాత అక్కడ నుంచి బలగాలను ఉప సంహరించుకుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌‌లో పండుగ వాతావరణం నెలకొనగా, జెలెన్ స్కీ రష్యాను తరిమికొట్టామని ప్రకటించేశారు. అయితే వెనక్కు వెళుతున్న రష్యన్ బలగాలు దొంగతనాలకు పాల్పడడం, అందుకు సంబంధించిన వీడియోలు రిలీజ్ కావడంతో సంచలనంగా మారింది. పోతూ పోతూ రష్యా బలగాలు.. జూలోని జంతువులను బలవంతంగా తమతో పాటు పట్టుకెళ్తున్నారు.

ఖేర్సాన్ జూ నుంచి ఏడు రకూన్లు అనే అమెరికన్ ఎలుగుబంట్లు, రెండు ఆడ తోడేళ్ళు, ఒంటె, నెమళ్లు, గాడిదలను వాహనంలో ఎక్కించిన వీడియో ప్రస్తుతం ఉక్రెయిన్ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అంతటితో ఆగక.. ఆసుపత్రుల్లోని కళాఖండాలు, వైద్యపరికరాలు కూడా పట్టుకుపోయారు. ఆర్ట్ గ్యాలరీ నుంచి పెయింటింగులు, మ్యూజియంల నుంచి పురాతన వస్తువులను దొంగిలించారని ఉక్రెయిన రక్షణ మంత్రిత్వ శాఖ మండిపడింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పోరాడే ధైర్యం లేక పలాయం చిత్తగించి ఇలా దొంగతనానికి ఒడిగట్టారని ఆగ్రహంతో ట్వీట్లు చేస్తున్నారు.