కిందపడిన వెయిట్ లిఫ్టర్.. మోకాళ్లు పెళపెళా విరిగాయి (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

కిందపడిన వెయిట్ లిఫ్టర్.. మోకాళ్లు పెళపెళా విరిగాయి (వీడియో)

August 14, 2020

Russian Weightlifter Alexander Knee Broken

వెయిట్ లిప్టింగ్ సమయంలో విషాదం చోటు చేసుకుంది. బరువు ఎత్తిపట్టుకోగానే కిందపడటంతో రెండు మోకాళ్లు పెళపెళా విరిగిపోయాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన రష్యాలో చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ సంఘటన విషాదంలోకి నెట్టింది.  భరించలేని నొప్పితో అల్లాడిపోవడం చూసి అక్కడున్న వారంతా విచారం వ్యక్తం చేశారు. ప్రముఖ వెయిట్ లిఫ్టర్ అలెగ్జాండర్ సెడిఖ్‌కు ఈ ఊహించని పరిణామం ఎదురైంది. 

మాస్కో‌లోని డాల్గోప్రడ్నీలో ‘వరల్డ్ రా పవర్ లిప్టింగ్ ఫెడరేషన్’ ఆధ్వర్యంలో వేయిట్ లిఫ్టింగ్ పోటీలు జరుగుతున్నాయి. అలెగ్జాండర్ సెడిఖ్‌ పోటీలో భాగంగా 408 కేజీల బరువును పైకి ఎత్తాడు. ఈ క్రమంలో లైవ్‌లోనే కుప్పకూలాడు. భారీ బరువును మొత్తం తనపైనే పడిపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. ఎముకలు పెళపెళా విరుగుతూ కిందపడిపోయాడు. ఈ సంఘటనతో అతని రెండు మోకాళ్లు విరిగాయి. ఆరు గంటల శస్త్ర చికిత్స తర్వాత ఎముకలను అతికించారు. ఇంకా కొంత కాలం గడిస్తే కానీ అతడు పోటీలో పాల్గొనే అవకాశం ఉందో లేదో చెప్పవచ్చని అంటున్నారు.