ఎవరు గెలుస్తున్నారో జోస్యం చెప్పిన పులి - MicTv.in - Telugu News
mictv telugu

ఎవరు గెలుస్తున్నారో జోస్యం చెప్పిన పులి

April 16, 2019

చిలక జోస్యం విన్నాం.. కానీ మీరు పులి జోస్యం గురించి ఎప్పుడైనా విన్నారా? రష్యాలోని క్రాస్నయార్క్స్‌లో ఉండే పులి జోస్యం చెపుతుంది. ఏకంగా ఒక దేశ అధ్యక్షడిగా ఎవరు గెలుస్తారనే విషయమై జోస్యం చెప్పడం గమనార్హం.

Russian zoo animals place their bets on Ukraine's presidential frontrunners.

ఉక్రెయిన్‌లో త్వరలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఓ పెద్ద పులి జోస్యం చెప్పింది. ఈ పులి చెప్పిన జోస్యాలు గతంలో నిజం కావడంతో ఈసారి కూడా దాని ముందు ప్రధాన అభ్యర్థుల చిత్రాలను ముద్రించిన పెట్టెలను ఉంచారు. ఆ పెద్దపులి కాసేపు అటూ ఇటూ తిరిగి వోలోదిమిర్‌ జెలెన్‌ స్కీ బొమ్మలున్న పెట్టెను తాకింది. దీంతో తమ నేత గెలవబోతున్నారని వోలోదిమిర్‌ జెలెన్‌ స్కీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పులి జోస్యాన్ని ఇక్కడి పత్రికలు కూడా ప్రముఖంగా ప్రచురించాయి.