ఆగిన ఉక్రెయిన్ - రష్యా యుద్ధం.. కారణం ఇదే - MicTv.in - Telugu News
mictv telugu

ఆగిన ఉక్రెయిన్ – రష్యా యుద్ధం.. కారణం ఇదే

March 5, 2022

ఉక్రెయిన్‌‌పై గత తోమ్మిది రోజులుగా దాడులతో, భయకరమైన బాంబులతో విరుచుకుపడుతూ ఉక్రెయిన్‌లోని పలు ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకుంటున్న రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ చేసుకుంది. ఉక్రెయిన్‌లోని మరియు పోల్, వోల్నావోఖ్ నగరాల్లో పౌరులను సురక్షితంగా తరలించేందుకుగానూ ‘హ్యూమన్ కారిడార్‌’ల ఏర్పాటుకు రష్యా అవకాశం కల్పించింది. ఈ మేరకు తాత్కాలికంగా కాల్పులను విరమిస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. రష్యా కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి తమ దళాలు కాల్పులను నిలిపేస్తాయని వెల్లడించింది.

మరోపక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నాటో కూటమిపై మండిపడ్డారు. ఉక్రెయిన్ గగనతలాన్ని ‘నో-ఫ్లై జోన్’గా ఏర్పాటు చేయాలన్న తన అభ్యర్ధనను తిరస్కరించారు అని ఆవేదన చెందాడు. తమ దేశంపై రష్యా బాంబుల వర్షం కురిపించేందుకు నాటో నిర్ణయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని విమర్శించారు.