ఖేర్సన్‌పై జెండా పాతిన రష్యా.. ఆగని దాడులు - MicTv.in - Telugu News
mictv telugu

ఖేర్సన్‌పై జెండా పాతిన రష్యా.. ఆగని దాడులు

March 3, 2022

005

 

ఉక్రెయిన్‌ దేశంలోని పలు ప్రధాన నగరాలపై కన్నేసిన రష్యా.. గత ఎనిమిది రోజులుగా భీకరమైన దాడులు చేస్తూ, ఇప్పటికే పలు నగరాలను తన వశం చేసుకుంది. తాజాగా మరో ప్రధాన నగరమైన ఖేర్స్‌న్‌పై తీవ్రస్థాయిలో దాడి చేసి జెండాను పాతింది. అంతేకాకుండా ఇక నుంచి ఈ ఖేర్సన్ పూర్తిగా తమదేనంటూ ప్రకటించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది. అయితే, మరో నగరం మరియు పోల్ ఇంకా తమ చేతుల్లోనే ఉందని ఉక్రెయిన్ పేర్కొంది.

మరోపక్క యుద్ధం కారణంగా ఇప్పటికే సామాన్య పౌరులు, చిన్నారులు, భారతీయ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకోవాలని చూస్తున్న రష్యా బలగాలను ఉక్రెయిన్ సామాన్య పౌరులు అడ్డుకుంటున్నారు. టైర్లు, లారీలు అడ్డుపెట్టి శత్రు సైనికులను నిలువరిస్తున్నారు.