బాలీవుడ్‌కు ఆర్ఎక్స్ 100.. - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్‌కు ఆర్ఎక్స్ 100..

September 25, 2018

నటుడు కార్తీకేయ నటించిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం  సంచలనం సృష్టించి, మంచి విజయాన్ని అందిపుచ్చుకుంది.  దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను యాక్షన్, రొమాంటిక్ లవ్‌స్టోరిగా తెరకెక్కించాడు. అంతేకాకుండా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ,ప్రేక్షకుల ముందుకు వచ్చి కాసుల వర్షం కురిపించింది. దీంతో ఈ సినిమాపై ఇతర దర్శకనిర్మాతల కన్ను పడింది. ఇతర బాషాల్లో తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని తమిళంలో తెరకెక్కిస్తుండగా,హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు.ఇదిలా వుండగా బాలీవుడ్‌లోనూ ఈ చిత్రంపై క్రేేజ్ ఏర్పడింది. అక్కడ రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కడ సాజిద్ నడియాడ్ వాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో సునీల్ శెట్టి కొడుకు ఆహాన్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. బాలీవుడ్‌లో ఈ చిత్రం విజయం సాధిస్తే, ఆహాన్ శెట్టి కెరియర్‌కు ఎంతో ఉపయోగపడుతుందని సునీల్ శెట్టి భావిస్తున్నాడు. మరి ఆర్ఎక్స్ 100లో ఆహాన్ ఎలా నటిస్తాడో చూడాలి .