‘ఆర్‌ఎక్స్ 100’ అమ్మడుతో.. బాలయ్య జోడి - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్‌ఎక్స్ 100’ అమ్మడుతో.. బాలయ్య జోడి

May 16, 2019

Rx100 Movie Heroine Payal rajput next Movie With Senior Hero Nandamuri balakrishna.

తెలుగులో సంచలనం సృష్టించిన సినిమా ‘ఆర్‌ఎక్స్ 100’. చిన్న సినిమాగా వచ్చిన భారీ విజయం సాధించింది. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రేక్షకుల మనసు దోచేసింది. తన అందంతో కుర్రకారును మత్తెక్కించిన ప్రస్తుతం సీనియర్ హీరోలు రవితేజ డిస్కోరాజా సినిమాలో, వెంకటేశ్‌కు జోడిగా వెంకీ మామ సినిమాలో నటిస్తోంది. అలాగే తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా తెరకెక్కుతున్న సీత సినిమాలో కూడా పాయల్ ఓ స్పెషల్ సాంగ్ లో అలరించనుంది.

తొలి సినిమాలో బోల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న పాయల్ కు తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. కాగా ఈ అమ్మడు ఇప్పుడు మరో సీనియర్ హీరోతో జోడికి సై అన్నట్లు సమాచారం. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన పాయల్ రాజ్‌పుత్ ను తీసుకోనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది.