చెంప పగల గొట్టాలనిపించింది… ‘ఆర్ ఎక్స్ 100’ హీరోయిన్ పాయల్ - MicTv.in - Telugu News
mictv telugu

చెంప పగల గొట్టాలనిపించింది… ‘ఆర్ ఎక్స్ 100’ హీరోయిన్ పాయల్

October 19, 2018

తెలుగులో సంచలనం సృష్టించిన సినిమా ‘ఆర్‌ఎక్స్ 100’. ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సాధించింది ఈ చిత్రం. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. తన అందంతో కుర్రకారును మత్తెక్కించిన ఈ భామ, ‘మీటూ’ ఉద్యమంపై స్పందించింది. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ నిజమేనని ఒప్పుకుంది.  Rx100 Movie Heroine Payal Rajput Shocking Comments On Casting Couchఇటీవల ఆమె ఓ ఇంటర్వూలో మట్లాడుతూ తొలి సినిమాలో అందాలు ఆరబోసి నటించడంతో తనను అందరూ అలాగే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఓ వ్యక్తి సినిమాలో అవకాశం ఇస్తానంటూ కలిసి, ఆఫర్ ఇస్తే తనకేమిస్తావని అడిగాడని చెప్పింది. అతడి మాటాలు విన్న పాయల్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. అతడి చెంప పగల గొట్టాలనిపించింది.. అయినా కంట్రోల్ చేసుకున్నానని పేర్కొంది.

‘సినిమాలో నా టాలెంట్‌కు గుర్తింపు వచ్చింది. ఒక్క ముద్దు సీన్లలో నటించినందుకు కాదు. అని అతనికి చెప్పాను. నీ ఆఫర్ వద్దు ఏం వద్దు అని చెప్పేశాను’. అని పేర్కొంది. అయితే అలా అడిగిన వ్యక్తి పేరు మాత్రం పాయల్ బయటపెట్టలేదు.