తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త తెలిపింది.ఈ నెల 28 నుంచి వానాకాలం రైతుబంధు నిధులు.. అర్హుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో వెంటనే సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనున్నది. కాగా రైతుబంధుపై వివరాలు తెలుసుకునేందుకు, ఫిర్యాదులు చేసేందుకు త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, విజ్ఞప్తులు తీసుకునేందుకు ఈ కాల్ సెంటర్‌ను ఉపయోగపడుతుందని చెప్పారు. వ్యవసాయ సీజన్ అదునులో సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.