జక్కన్నకు అక్కినేని అవార్డు - MicTv.in - Telugu News
mictv telugu

జక్కన్నకు అక్కినేని అవార్డు

September 8, 2017

తెలుగు సినిమా ఖ్యాతిని ‘ బాహుబలి ’ సినిమాతో ప్రపంచ స్థాయికి చాటిన ది మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ జక్కన్న అలియాస్ ఎస్. ఎస్. రాజమౌళికి మరో పురస్కారం లభించింది. 2017 సంవత్సరానికి గాను అక్కినేని నాగేశ్వర్రావు అవార్డును రాజమౌళికి అందించనున్నట్టు అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ ద్వాదా తెలిపాడు. తన తండ్రి చనిపోయినప్పటినుండి ప్రతి ఏడు ఈ అవార్డును ఇస్తున్నారు. ఈసారి జక్కన్నకు ఈ అవార్డు దక్కింది. సెప్టెంబర్ 17న శిల్పకళా వేదికలో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రానున్నాడు. ఆయన చేతుల మీదుగానే ఈ అవార్డును రాజమౌళి అందుకోనున్నాడు. ఇప్పటికే పద్మశ్రీ అవార్డు అందుకున్న రాజమౌళి అక్కినేని అవార్డు అందుకోనుండటం టాలీవుడ్ కు గుడ్ న్యూసే.