జగన్ ప్రభుత్వంపై ప్రభాస్ కామెంట్ - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ ప్రభుత్వంపై ప్రభాస్ కామెంట్

August 18, 2019

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌‌పై బాహుబలి ప్ర‌భాస్ ప్ర‌శంస‌లు కురిపించారు. దానికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ నటించిన సాహో సినిమా ప్రమోషనల్‌లో భాగంగా, ఓ తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌కు.. జగన్ పాలన ఎలా వుందన్న ప్రశ్న ఎదురైంది. 

రాష్ట్రంలో జగన్‌‌ను బాహుబలిగా అభివర్ణిస్తున్నారని చెబుతూ, ఆయన పాలనపై మీరు ఏమనుకుంటున్నారని యాంకర్ ప్రశ్నించారు. దీనికి ప్రభాస్ స్పందిస్తూ, తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని, అయితే ఓ యువనేతగా జ‌గ‌న్ రాష్ట్ర అభివృద్ది ప‌థంలో న‌డిపిస్తార‌నే న‌మ్మకం తనకుందని అన్నారు. జగన్‌‌పై ప్ర‌భాస్ చేసిన కామెంట్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.