సాహో వాయిదాపై నిర్మాతల అధికారిక ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

సాహో వాయిదాపై నిర్మాతల అధికారిక ప్రకటన

July 19, 2019

బాహుబలి తరువాత ప్రభాస్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సాహూ’. 2017లో చిత్రీకరణ మొదలై దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న ‘సాహో’ ప్రయాణం ఇటీవల ముగిసినట్లు తెలిసింది. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ ‘సాహో’. ఇందులో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్‌ హీరోయిన్. వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు యూవీ క్రియేషన్స్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసినట్లు తెలిసింది. ఈ విషయం నిజం అని చెప్పేలా ప్యాకప్‌ పార్టీలో పాల్గొన్న ప్రభాస్‌ ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

ఈ సంగతి ఇలా ఉంటే..‘సాహో’ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు గతంలో చిత్రబృందం ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆగస్టు 15న విడుదల కావడం లేదని, ఆగస్టు 30న విడుదల కాబోతుందని యూవీ క్రియేషన్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గ్రాఫిక్స్‌ వర్క్స్‌ ఇంకా పెండింగ్ ఉండటంవల్ల అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం వల్లే ‘సాహో’ విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. నాని నటిస్తున్న గ్యాంగ్ లీడర్ కూడా అదే రోజున విడుదలకు సిద్దమవుతోంది.