‘సాహో’ సర్‌ప్రైజ్‌ అదిరిపోయింది.. - MicTv.in - Telugu News
mictv telugu

‘సాహో’ సర్‌ప్రైజ్‌ అదిరిపోయింది..

May 21, 2019

డార్లింగ్స్ సర్‌ప్రైజ్ అంటూ నిన్న ప్రభాస్ విడుదల చేసిన వీడియోతో.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల ఉత్కంఠకు తెరపడింది. సాహో సినిమాలో ప్రభాస్‌ తన కొత్త లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఆగస్టు 15న థియేటర్‌లో కలుద్దామని పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్ ‘డార్లింగ్‌’ సీరియస్‌గా.. మిస్టరీ లుక్‌లో కనిపించారు.

ప్రభాస్ బర్త్ డే‌తో పాటు హీరోయిన్ శ్రద్ధ కపూర్ పుట్టినరోజున సందర్భంగా సాహో సినిమాకు సంబంధించిన టీజర్‌లు విడుదల చేశారు. మళ్ళీ అప్పటి నిన్నటిదాకా సాహోకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. అనూహ్యంగా నిన్న ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పెడుతూ.. డార్లింగ్ మీకు రేపు ఒక సర్‌ప్రైజ్.. అని చెప్పగానే అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

బహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘సాహో’కు సుజీత్‌ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. నీల్‌ నితిన్‌ ముకేష్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.