సాహూ టీజర్ వచ్చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

సాహూ టీజర్ వచ్చేసింది..

June 13, 2019

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సాహో’ టీజర్ ఈరోజు విడుదలైంది. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగష్టు 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి రన్ రాజా రన్ సుజీత్ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ, హిందీ, తెలుగు భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్, మురళీ శర్మ, మందిరా బేడీ, అరుణ్ విజయ్, జాకీ షరీఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.