అయ్యప్ప భక్తులకు శుభవార్త - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యప్ప భక్తులకు శుభవార్త

November 28, 2017

అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త. శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి దర్శన సమయాన్ని పెంచారు. మండల పూజల సమయంలో స్వామిని దర్శించుకునేందుకు ఈ ఏడాది భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు దర్శన వేళల్లో మార్పులు చేసింది.

ప్రస్తుతం స్వామిని తెల్లవారుజామున 4 గంటల నుంచి మాత్రమే అనుమతిస్తుండగా.. ఇక నుంచి గంటకు ముందునుంచే అంటే  3 గంటల నుంచే అనుమతిస్తారు. అలాగే అర్ధరాత్రి ఒంటి గంటవరకూ స్వామిని చూడొచ్చు.

ఇదివరకు రాత్రి 11 గంటలకు స్వామి హరివరాసనం చేసిన తరువాత గుడిని మూసేవారు. ఇకపై హరివరాసనం పూజను అర్ధరాత్రి 1 గంటకు నిర్వహిస్తారు. దర్శన వేళల పెంపు మండల పూజల వరకే ఉంటుందని ట్రావెన్‌ కోర్‌దేవస్థానం​ బోర్డు పేర్కొంది. మరోపక్క.. యాత్రికుల రద్దీ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.