శబరిమల గుడిలోకి 15 ఏళ్ల బాలిక - MicTv.in - Telugu News
mictv telugu

శబరిమల గుడిలోకి 15 ఏళ్ల బాలిక

November 21, 2017

రుతుచక్ర వయసులో ఉన్న మహిళలపై నిషేధం అమల్లో ఉన్న శబరిమల అయ్యప్ప గుడిలో మళ్లీ కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన 15 ఏళ్ల బాలిక మగపిల్లాడి వేషంలో గుడిలోకి అడుగు పెట్టింది. ఆమె కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో సిబ్బంది అడ్డుకుని బయటికి పంపారు. బాలిక 15 మంది పురుష భక్తులతో కలసి వచ్చింది. ఆమెను గుళ్లోకి తీసుకెళ్లడానికి వారు అబ్బాయిలా మార్చారు. జట్టు కత్తిరించి, టోపీ పెట్టారు. దీంతో అందరూ అబ్బాయే అని అనుకున్నారు. తర్వాత ఆమెను తమ మధ్యలో ఉంచుకుని చాటుగా గుడిలోకి తీసుకెళ్లారు. ఆలయ సిబ్బంది నిఘాలో ఈ సంగతి బయటపడింది. దీంతో బాలికను పక్కకకు తీసుకెళ్లి విచారించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కే చెందిన 31 ఏళ్ల మహిళ ఈ గుడిలోకి చొరబడిన నేపథ్యంలో ఆడవాళ్లు లోపలికి రాకుండా గట్టి నిఘా అమలు చేస్తున్నారు. 10 నుంచి 50 ఏళ్ల వయసు  ఉన్న మహిళలు ఈ గుడికి రాకూడదని నిషేధం ఉంది.