అయ్యప్ప భక్తులకు శుభవార్త..! - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యప్ప భక్తులకు శుభవార్త..!

November 24, 2019

కార్తీక మాసం మొదలైందంటే శబరిగిరులు శరణుఘోషతోమార్మోగుతుంటాయి. శరణం అయ్యప్ప అంటూ భక్తులు పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకుంటారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు వివిధ వాహనల్లో వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉంటారు. కానీ వారు వచ్చే వాహనాలను పైకి అనుతించకపోవడంతో భక్తులు చాలా సార్లు ఇబ్బందులు పడేవారు. గత ఏడాది నుంచి వాహనాలను నీలక్కల్ వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉండేది. కానీ ఈసారి అప్పటి నిబంధనలను ట్రావెన్ కోర్ అధికారులు సడలించారు. 

Sabarimala.

గత ఏడాది వరదల కారణంగా అయ్యప్ప భక్తులు పంపానది బేస్ క్యాంపు కంటే ముందే వాహనాలను నిలిపివేసేవారు. కానీ ఈ సారి అప్పటి ఆంక్షలను సడలించారు. కార్లు, 12 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న అన్ని వాహనాలను పంపానది బేస్ క్యాంపు వరకు అనుమతించనున్నారు. ప్రస్తుత నీలక్కల్ వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. ట్రావెన్ కోర్  తాజా నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.