ఆడవాళ్లు వస్తే అయ్యప్ప ఆత్మ క్షోభిస్తుంది.. తంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

ఆడవాళ్లు వస్తే అయ్యప్ప ఆత్మ క్షోభిస్తుంది.. తంత్రి

September 28, 2018

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలను వెళ్లనివ్వాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకంపనలు సృష్టిస్తోంది. సంప్రదాయవాదులు తీవ్రంగావ్యతిరేకిస్తున్నారు. ఆయన ధర్మకర్తలు కూడా భగ్గుమంటున్నారు.Sabarimala temple Ayyappa soul upset if women going to see him says tantric family member opposing supreme court verdictసుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని అయ్యప్ప ధర్మసేన నాయకుడు, ఆలయ తంత్రి కుటుంబానికి చెందిన సామాజిక కార్యకర్త రాహుల్ ఈశ్వర్ అన్నారు. ‘సుప్రీం ఆదేశాలతో ఆడవాళ్లు అయ్యప్ప గుడిలోకి వస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుంది. ఇది స్వామి వారి బ్రహ్మచర్యానికి సంబంధించిన విషయం. ఆడవాళ్లు వస్తే ఆయన హక్కు దెబ్బతింటుంది. ఇలాంటి తీర్పులు ఆలయాలను దెబ్బతీస్తాయి. ఆడవాళ్లందరిపైనా నిషేధం లేదన్న సంగతిని కూడా కోర్టులు గుర్తించాలి. కేవలం 10 నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న మహిళలకే ప్రవేశం లేదు..ఈ విషయాన్ని కోర్టులు భక్తుల మనోభావాల కోణంలో చూడాలి’ అని అన్నారు. తాము ఈ విషయంలో ఇతర మతాలకు చెందిన పెద్దల మద్దతు కూడగట్టి మళ్లీ కోర్టుకు వెళ్తామని ట్రావెన్ కూర్ దేవస్వాం బోర్డు చీఫ్ పద్మకుమార్ చెప్పారు.