వచ్చే నెల 26న అయ్యప్ప ఆలయం మూసివేత - MicTv.in - Telugu News
mictv telugu

వచ్చే నెల 26న అయ్యప్ప ఆలయం మూసివేత

November 25, 2019

శబరిగిరుల్లోని అయ్యప్పస్వామి ఆలయాన్ని వచ్చే నెల 26న మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా పూజా కార్యక్రమాలు ఏవీ నిర్వహించడంలేదని ట్రావెన్ కోర్ బోర్డు ప్రకటించింది. నాలుగు గంటల పాటు మూసివేసి తర్వాత సంప్రోక్షణ చేయనున్నారు. ఆ మరుసటి రోజు యథావిధిగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్టు తెలిపారు. 

Sabarimala

ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 11:30 వరకు సూర్యగ్రహణం ఉన్నట్టు పండితులు తెలిపారు. దాంతో నాలుగు గంటలపాటు ఆలయాన్ని మూసివేసి సూర్యగ్రహణం ముగిసిన వెంటనేఆలయాన్ని తెరిచిన అనంతరం పుణ్యహవచన  చేస్తారు. ఆ వెంటనే మూసివేస్తారు. 27వ తేదీన మళ్లీ ఆలయాన్ని తెరవనున్నారు. కాాాగా ఈనెల 17 నుంచి అయ్యప్ప భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు మాలధారణతో తరలివస్తున్నారు.