శబరిమల ఆలయంలోకి మహిళ - MicTv.in - Telugu News
mictv telugu

శబరిమల ఆలయంలోకి మహిళ

November 20, 2017

అయ్యప్పస్వామి కొలువై ఉన్న కేరళ శబరిమల ఆలయంలోకి 31 ఏళ్ల మహిళ ప్రవేశవించడానికి ప్రయత్నించించింది. ఈ గడిలోకి రుతుచక్ర వయసులో మహిళలు (10 నుంచి 50 ఏళ్లలోపు) రాకుండా నిషేధం ఉండడం, దీన్ని పలు మహిళాసంఘాలువ్యతిరేకిస్తుండడం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన  ఒక మహిళ గుడి ముందుభాగంలోని పదునెట్టాంపడిని ఎక్కేందుకు యత్నించింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెను అడ్డుకుని అక్కడి నుంచి బయటికి బలవంతంగా తీసుకెళ్లారు.  సదరు మహిళ యత్నించగా, గుర్తించిన అధికారులు, పోలీసులు ఆమెను అడ్డుకుని వెనక్కి పంపారు. ఆమె వద్ద ఉన్న గుర్తింపు కార్డును బట్టి మె వయసు 31 ఏళ్లని నిర్ధారించినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్‌ సతీశ్ బినో తెలిపారు. ఆమె తన కుటుంబ సభ్యులతో వచ్చిందన్నారు. అయితే సిబ్బంది పొరపాట్ల కారణానే ఆమె గుడిలోకి చొరబడినట్లు తేలింది.

శబరిమలకు వచ్చే మహిళల గుర్తింపుకార్డులను జాగ్రత్తగా తనిఖీ చేసి.. ముఖ్యంగా వయసుపై దృష్టి పెట్టి, అనంతరం కొండపైకి పంపుతారు. దేశంలోని అన్ని గుళ్లలోకి మహిళలకు ప్రవేశం ఉన్న నేపథ్యంలో అయ్యప్ప గుళ్లోకీ తమను రానివ్వాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మహిళను శక్తిస్వరూపిణి, ఆదిపరాశక్తి అని పిలుస్తుంటారని, కానీ ఆచరణలో మాత్రం తీవ్ర వివక్ష చూపుతున్నా కేరళ మహిళాయతనం నేత పూరూరుకట్టి లత ఆరోపించారు.