శబరిమల అయ్యప్ప గుడిని ఈ రోజు రాత్రి మూసేయనున్నారు. నెలవారీ పూజల కోసం బుధవారం సాయంత్రం గుడిని తెరవగా… సుప్రీం కోర్టు తీర్పుతో కొండలు రణరంగాన్ని తలపించడం తెలిసిందే. ఇప్పటివరకు ‘నిషేధిత’ వయసు మహిళలు పదిమంది.. అయ్యప్పను దర్శించుకోవడానికి విఫలయత్నం చేశారు. వీరిలో ఐదుగురు తెలుగు మహిళలు కావడం విశేషం.అయ్యప్పను అన్ని వయసుల మహిళలు దర్శించుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పివ్వడంతో మహిళలు పెద్ద సంఖ్యలో వెళ్లారు. అయితే అయ్యప్ప భక్తులు వారిని అడ్డుకున్నారు. బస్సుల్లో వెతికి పట్టుకుని మరీ కిందికి దించేశారు. కొందరిపై భౌతిక దాడులకు దిగారు. నీలక్కల్, పంబ క్యాంపుల్లో పెద్ద సంఖ్యలో ‘నిషేధిత’ మహిళలను చుట్టుముట్టి గో బ్యాక్ అన్నారు. అయితే సుప్రీం తీర్పు ప్రకారం.. అలాంటి మహిళలకు పోలీసులు రక్షణ కల్పించారు.
తెలుగు మహిళలు వీరే..
హైదరాబాద్‌లోని మోజో టీవీ జర్నలిస్టు జక్కల కవిత హెల్మెట్, బులెట్ ఫ్రూఫ్ జాకెట్‌తో కొండ ఎక్కి.. మరో వంద మీటర్లలో 18 మెట్లు ఉన్నాయనగా వెనుతిరగడం తెలిసిందే. భక్తుల మనోభావాలు గౌరవించి తానే వెనక్కి వచ్చేశానని, గెలుపు తనదేనని ఆమె చెప్పింది. ఆమె వస్తే గుడిని మూసేస్తాని ప్రధాన పూజరి హెచ్చించారు. ఇంక అయ్యప్ప గుడికి చేరువగా వెళ్లిన ఇతర తెలుగు మహిళల్లో గుంటూరుకు చెందిన వాసంతి, ఆదిశేషి ఉన్నారు. వీరిని పంబ తర్వాత భక్తులు అడ్డగించారు. ఏపీకి చెందిన బాలెమ్మతొపాటు మరో మహిళను కూడా 500 మీటర్ల దూరంలో అడ్డుకున్నారు.