వెంకన్నను దర్శించుకున్న  క్రికెట్ దేవుడు..! - MicTv.in - Telugu News
mictv telugu

వెంకన్నను దర్శించుకున్న  క్రికెట్ దేవుడు..!

July 20, 2017

మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్  తన భార్య అంజలీ తో కలిసి  ఈరోజు తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు, టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయరంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్దప్రసాదాలను, పట్టువస్త్రాలను సచిన్ దంపతులకు అందజేశారు,సచిన్  మహిళా క్రికెట్ గురించి మాట్లాడుతూ ఈరోజు జరిగే  మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ విజయంసాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మిథాలిరాజ్ నిలవడం, ఆమె భారతీయురాలు కావడం గర్వకారణమని సచిన్ అన్నాడు,ఇగ సచిన్ చూడడానికి ఆయన అభిమానులు పెద్దసంఖ్యలో వచ్చిన్రు,అభిమానుల తాకిడికి కొంచెం తోపులాట కూడా జర్గింది.