సరదా సరదాగా సచిన్.. వెరైటీగా స్పోర్ట్స్ డే.. - MicTv.in - Telugu News
mictv telugu

సరదా సరదాగా సచిన్.. వెరైటీగా స్పోర్ట్స్ డే..

August 29, 2019

క్రికెట్ గాడ్‌గా పేరు సంపాధించుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన ఆటతీరుతో ఎంతో మంది ప్రశంసలు పొందాడు. కేవలం ఆటల్లోనే కాదు బయట ఆయన చేసే పనులు కూడా అందరిని ఆకట్టుకుంటాయి. సమాజం పట్ల ఆయనకు ఉన్న జాగ్రత్త అలాంటిది. ఓసారి కారులో వెళ్తూ పక్కనే బైక్‌పై వెళ్తున్న యువకుడిని హెల్మెట్ పెట్టుకోవాలంటూ సూచించాడు. అంతే కాదు ఏ సంతోషాన్ని అయినా వినూత్నంగా జరుపుకోవడం కూడా ఆయనకు ఇష్టం. 

జాతీయ క్రీడా దినోత్సవం రోజు కూడా సచిన్ వినూత్నంగా వ్యవహరించారు.  ముంబయిలోని ఆంథోనీస్‌ వృద్ధాశ్రమాన్ని ఆయన సందర్శించాడు. అక్కడ ఉన్న వారితో గడిపి సరదాగా ఆటలు ఆడాడు. వారిని కూడా గేమ్స్ ఆడిపించి సంతోషాన్ని పంచాడు. ఒంటిరివారిమనే భావన లేకుండా ఉల్లాస పరిచాడు. ఆటలతో శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని ఈ సందర్భంగా చెప్పాడు. ఈ ఫొటోలు చూసిన ప్రతి ఒక్కరు సచిన్‌ను తెగ పొగిడేస్తున్నారు. అందరిలా మూసపద్దతిలో క్రీడా దినోత్సవాన్ని జరుపుకోకుండా వృద్ధులతో కలిసి ఆటలు ఆడటం అందరిని ఆకట్టుకుంటోంది.