బీజేపీలో చేరడం లేదు..సచిన్ పైలట్ స్పష్టీకరణ‌ - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీలో చేరడం లేదు..సచిన్ పైలట్ స్పష్టీకరణ‌

July 15, 2020

Sachin pilot about joining in bjp

రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం, యువనేత సచిన్ పైలట్‌ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు బావుట ఎగరేసిన సంగతి తెల్సిందే. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ విప్ జారీ చేసినప్పటికీ బేఖాతర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సచిన్ పైలట్ కు అనర్హత నోటీసులు జారీ చేసింది. అలాగే ఆయనతో ఉన్న ఇతర ఎమ్మెల్యేలకు కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలపై నోటీసులు జారీ చేశారు. 

ఈమేరకు అసెంబ్లీ స్పీకర్ మొత్తం 19 మంది రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరు కానందున్న వల్ల అనర్హత వేటు వేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. గెహ్లాట్‌కు వ్యతిరేకంగా ఇద్దరు మంత్రులు కూడా సచిన్ టీమ్‌లో చేరారు. అలాగే సచిన్ పైలట్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలువనున్నారని, అతడు బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. ఆ వార్తలను సచిన్ పైలట్ ఖండించారు. బీజేపీలో చేరడం లేదని పైలట్ స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై పోరాడి గెలిచామని, ఇప్పుడు తానెందుకు బీజేపీలో చేరాలని పైలట్ ప్రశ్నించారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు ఓ తప్పుడు ప్రచారం చేశారని ఆయన అన్నారు.