బీజేపీ జాతీయాధ్యక్షుడితో భేటీకానున్న సచిన్ పైలట్‌! - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ జాతీయాధ్యక్షుడితో భేటీకానున్న సచిన్ పైలట్‌!

July 13, 2020

nvnb

రాజస్థాన్ రాజకీయాలు వేడెక్కాయి. ఆ రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ యువనేత, డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ ‌పార్టీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్ బీజేపీ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. ఇప్పటికే సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వంపై తిరుబాటు జెండా ఎగరేసిన సచిన్‌, ఈ రోజు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత సచిన్‌ పైలట్‌ తన భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నారు. 

ఈ మేరకు తనకు మద్దతు తెలుపుతోన్న 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడితే గెహ్లాట్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిందని సచిన్‌ పైలట్‌ ప్రకటించారు. ఈ క్రమంలో తన మద్దతుదారులతో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు సీఎం గెహ్లాట్‌ ఇంట్లో జరిగే సీఎల్పీ సమావేశానికి హాజరుకావడం లేదని వెల్లడించారు. సచిన్‌ పైలట్‌కు బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింథియా మద్దతు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.