తొలి చేదు అనుభవం చెప్పిన సచిన్ టెండూల్కర్ - MicTv.in - Telugu News
mictv telugu

తొలి చేదు అనుభవం చెప్పిన సచిన్ టెండూల్కర్

October 26, 2019

Sachin  ...

కెరియర్‌లో ఎంత మంచి పొజిషన్ వచ్చినా.. ఆరంభంలో మాత్రం అన్ని చేదు అనుభవాలే ఉంటాయి. వాటి నుంచి ప్రేరణ పొందిన వారే జీవితంలో విజేతలుగా నిలుస్తారు. అలాంటి నిరాస క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు కూడా తప్పలేదు. గతంలో జరిగిన పాత జ్ఞాపకాలను ముంబైలోని లేట్ లక్ష్మణ్ రావు దూరే స్కూల్ ఫంక్షన్‌లో  ఆయన పంచుకున్నారు. అవే తన జీవితాన్ని మలుపుతిప్పినట్టు వెల్లడించారు. 

11 ఏళ్ల వయస్సులోనే  క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్న సచిన్  తొలిసారి సెలెక్షన్స్‌కు హాజరయ్యారు. మొదట్లో అతనికి కూడా నిరాశ తప్పలేదని తెలిపారు. భారత జట్టుకు ఆడాలన్న ధ్యేయం వెళితే తనను ఎంపిక చేయకుండా ఆట మరింత మెరుగు పరుచుకోవాలని సూచించినట్టు వెల్లడించారు. అదే  తనలో మరింత పట్టుదలను పెంచిందని, ఆటలో మరింతగా శ్రమించి మంచి పేరు తెచ్చుకున్నానని అన్నారు. జీవితంలో ఎవరూ షార్ట్ కట్‌లతో ఎదగరని అన్నారు. ఆనాటి విషయాలను విద్యార్థులతో పంచుకుంటూ తన అనుభవాలను వారికి చెప్పారు.