సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆఫ్ గాడ్ యే కాదు రాజ్యసభల ఎం.పి గుడ.ఆయింత మర్శిపోయిన్రా ఏంది.ఈయ్న పేరుకే ఎం.పి గనీ రాజ్యసభ మెట్లు సక్కగ ఎక్కుతనే లేడు అని.. మిగతా కొందరు ఎం.పిలు అన్నరు గదా,ఇగో ఇయ్యాల్ల సచిన్ రాజ్యసభల అడుగు వెట్టి గట్లన్నోళ్ల నోటికి తాళమేశినట్టు జేశిండు.సభల కూసోని అన్ని చర్చలు ఇన్నడు.సచిన్‌తోపాటు మరో నామినేటెడ్ ఎంపీ, బాక్సర్ మేరీ కోమ్ కూడా సభకు వచ్చింది.ఈ నడుమ సమాజ్‌వాదీ ఎంపీ నరేశ్ అగర్వాల్ సారైతె..అసలు సభలో ఎప్పుడూ కనిపించని సచిన్, రేఖల సభ్యత్వాన్ని రద్దు చేయాలె, వాళ్లను సభ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశిండు.
విజయ్ మాల్యాను సభ నుంచి బహిష్కరించినపుడు.. వీరిని మాత్రం ఎందుకు చేయకూడదు అని నరేశ్ అగర్వాల్ జరంత గట్టిగనే ప్రశ్నించారు.వాళ్లకు ఆసక్తి లేకపోతే రాజీనామా చేయొచ్చు కదా అని కూడా అన్నరు. 2012లో రాజ్యసభకు సచిన్ నామినేట్ అవగా.. అప్పటి నుంచి 348 రోజులు సభ నడవగా.. సచిన్ కేవలం 23 రోజులు హాజరయ్యాడట, రేఖ మేడం అయితే మరీ 18 రోజులు మాత్రమే సభలో కనిపించింది.ఇగ బడ్జెట్ సెషన్, అంతకుముందు జరిగిన వింటర్ సెషన్లో ఒక్క రోజు కూడా వీళ్లు రాలేదట.మరి ఒ దిక్కు సేవా కార్యక్రమాలతోని, ఇంకోదిక్కు క్రికెట్ తోని జరంత బిజీ ఉండి రాలేదోమో గీయంత దానకే మా సచిన్ ను విజయ్ మాల్యాతోని పోలుస్తరా అని గరమైతున్నరట..గీ క్రికెట్ దేవుడి కొందరి ఫ్యాన్సు.